జూన్ నుండి సెట్స్ మీదకు విరాటపర్వం !

Published on Apr 30, 2019 3:22 pm IST

‘నీది నాది ఒకే కథ’ ఫేమ్ వేణు ఊడుగుల రానా , సాయి పల్లవి జంటగా విరాటపర్వం అనే చిత్రాన్ని తెరకెక్కించనున్నాడని ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి. నిజానికి ఎప్పుడో మొదలు కావాల్సిన ఈచిత్రం వాయిదాపడుతూ వస్తుంది. ఇక ఎట్టకేలకు ఈ చిత్రం జూన్ నుండి ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. తాజాగా ఈ చిత్రం కోసం తన డేట్స్ ను అడ్జెస్ట్ చేసుకున్నాడట రానా. ఈచిత్రంలో రానా నక్సలైట్ పాత్రలో నటించనుండగా ఆయనకు జోడిగా సాయి పల్లవి నటించనుంది. ఇక వీరితో పాటు సీనియర్ నటి టబు అలాగే మాజీ హీరోయిన్ ప్రియమణి ముఖ్య పాత్రల్లో నటించనున్నారు.

1990 బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని సురేష్ బాబు , చెరుకూరి సుధాకర్ సంయుక్తంగా నిర్మించనున్నారు. త్వరలోనే ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి.

సంబంధిత సమాచారం :