‘విరాటపర్వం’ విషయంలో అది జరగనే జరగదట

Published on May 14, 2021 3:00 am IST

లాక్ డౌన్ మూలాన పూర్తైన సినిమాలు అనేకం విడుదల కాకుండా ఆగిపోయాయి. ఇప్పటికీ వాటి విడుదల విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. వాటిలో రానా దగ్గుబాటి నటించిన ‘విరాటపర్వం’ కూడ ఒకటి. వేణు ఊడుగుల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రానాకు జోడీగా సాయి పల్లవి నటిస్తోంది. ముందుగా అనుకున్న ప్రకారం సినిమా 30 ఏప్రిల్ నాడు విడుదలకావాలి. కానీ కరోనా ఉధృతి ఎక్కువ అవుతుండటంతో వాయిదా వేశారు టీమ్.

దీంతో సినిమా ఓటీటీలో విడుదలతుందనే వార్తలు మొదలయ్యాయి. సినిమా హాళ్లు ఎప్పుడు తెరుచుకుంటాయో స్పష్టత లేదు కాబట్టి నిర్మాతలు ఓటీటీకి వెళ్లాలని డిసైడ్ అయినట్టు చర్చలు నడిచాయి. కానీ వాటిలో నిజం లేదని తేలింది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన శాటిలైట్, డిజిటల్, హిందీ డబ్బింగ్ శాటిలైట్ హక్కులు అమ్ముడుపోయాయి. థియేట్రికల్ హక్కులను డిస్ట్రిబ్యూటర్లకు విక్రయించేశారు మేకర్స్. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా థియేటర్లలో రిలీజ్ కావాల్సిందే. ఇప్పటికే విడుదలైన టీజర్ విశేషంగా ఆకట్టుకోవడంతో చిత్రం మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

సంబంధిత సమాచారం :