‘నాని’ డైరెక్టర్ తో కళ్యాణ్ రామ్ ఫిక్సేనా ?

‘నాని’ డైరెక్టర్ తో కళ్యాణ్ రామ్ ఫిక్సేనా ?

Published on Oct 21, 2019 8:15 AM IST

‘శతమానం భవతి’, ‘శ్రీనివాస కళ్యాణం’ లాంటి ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు సతీష్ వేగేశ్న నందమూరి కళ్యాణ్ రామ్ తో సినిమా చేస్తున్నాడు. అలాగే కళ్యాణ్ రామ్ హీరోగా నూతన దర్శకుడు మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో సోషియో ఫాంటసీ నేపథ్యంలో మరో సినిమా తెరకెక్కబోతుంది. ఈ సినిమా తర్వాత ఉయ్యాల జంపాల, మజ్ను చిత్రాల దర్శకుడు విరించి వర్మతో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. తన రెండో సినిమాగా నానితో మజ్ను తీసి పర్వాలేదనిపించుకున్నాడు ఈ డైరెక్టర్. కాగా విరించి వర్మ నందమూరి కళ్యాణ్ రామ్ కోసం ఇప్పటికే ఓ స్క్రిప్ట్ కూడా పూర్తి చేసిననట్లు తెలుస్తోంది.

కాగా పల్లెటూరి నేపథ్యంలో ఈ సినిమా సాగతుందట. ఇక నందమూరి హీరో కళ్యాణ్ రామ్ సంక్రాంతి పోటీలో దిగుతున్నాడు. మహేష్ సరిలేరు నీకెవ్వరూ, అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో చిత్రాలతో పాటు రజిని కాంత్ దర్బార్ మూవీ కూడా సంక్రాంతికి పోటీగా వస్తున్నాయి. మరి ఆ పోటీలో కళ్యాణ్ రామ్ ఎంతవరకు నెట్టుకొస్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు