నాలుగవ వారంలో కూడా దూసుకుపోతున్న ‘విరూపాక్ష’

Published on May 13, 2023 12:00 am IST


సాయిధరమ్ తేజ్, సంయుక్తా మీనన్ హీరో హీరోయిన్స్ గా తెరకెక్కిన లేటెస్ట్ సక్సెసుల్ మూవీ విరూపాక్ష. యువ దర్శకుడు కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లింగ్ హర్రర్ మూవీని సుకుమార్ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సంస్థలు గ్రాండ్ లెవెల్లో నిర్మించాయి. రాజీవ్ కనకాల, యాంకర్ శ్యామల, సునీల్, బ్రహ్మాజీ, అభినవ్ గోమఠం తదితరులు ఇందులో కీలక పాత్రలు చేసారు.

అజనీష్ లోకనాథ్ సంగీతం అందించిన ఈ మూవీ ప్రస్తుతం సక్సెస్ఫుల్ గా నాలుగవ వారంలోకి అడుగుపెట్టింది. ఈ మూవీ నాలుగవ వారంలో కూడా మంచి కలెక్షన్స్ రాబడుతోందని, మరోవైపు ఇతర రిలీజ్ లు ఉన్నప్పటికీ కూడా మొత్తంగా కలెక్షన్స్ బాగానే లభిస్తుండడం విశేషం అని అంటున్నారు సినీ అనలిస్టులు. కాగా ఈ మూవీ ఇప్పటికే పలు ఇతర భాషల్లో కూడా రిలీజ్ అయి అక్కడ కూడా మంచి రెస్పాన్స్ అందుకుంటుండడంతో యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తోంది.

సంబంధిత సమాచారం :