మాస్ హీరో నెక్స్ట్ మూవీ ‘చక్ర’ అట…!

Published on Nov 15, 2019 12:48 pm IST

మాస్ హీరో విశాల్ నటించిన యాక్షన్ మూవీ నేడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు,తమిళ భాషలలో గ్రాండ్ గా విడుదల కానుంది. సి సుందర్ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో మిల్కీ బ్యూటీ తమన్నా లేడీ కమాండో ఆఫీస్ గా నటించడం విశేషం. విశాల్ కెరీర్ లో భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. మరో వైపు నేడు హీరో విశాల్ తన తదుపరి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదల చేశారు.

చక్ర అనే పవర్ ఫుల్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు ఎం ఎస్ ఆనందన్ తెరకెక్కించనున్నాడు. గత ఏడాది సైబర్ క్రైమ్స్ నేపథ్యంలో వచ్చిన అభిమన్యుడు చిత్రానికి సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కుతోందని సమాచారం. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై ఆయన స్వయంగా నిర్మిస్తుండగా శ్రద్దా శ్రీనాధ్, రెజీనా కాసాండ్రా, శ్రుతీ డాంగే హీరోయిన్లుగా నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More