మరో మాస్ ప్రాజెక్ట్ తో వస్తున్న విశాల్.!

Published on Aug 29, 2021 9:29 am IST


యాక్షన్ హీరో విశాల్ కి అటు తమిళ్ తో పాటుగా తెలుగులో కూడా డీసెంట్ మార్కెట్ ఎప్పుడు నుంచో ఉన్న సంగతి తెలిసిందే. మరి ఇప్పటి వరకు మంచి సినిమాలనే ఆసక్తికర సబ్జెక్టు లను ఎంచుకుంటున్న విశాల్ పుట్టినరోజు ఈరోజు కావడంతో రెండు సినీ వర్గాల నుంచి తనకి బర్త్ డే విషెష్ తెలియజేస్తున్నారు. మరి ఇదిలా ఉండగా ఈ స్పెషల్ డే న తన కొత్త ప్రాజెక్ట్ అనౌన్సమెంట్ వచ్చింది.

తు పా శరవణన్ దర్శకత్వంలో విశాల్ హీరోగా “సామాన్యుడు” అనే మాస్ ప్రాజెక్ట్ అనౌన్స్ అయ్యింది. దాని తాలూకా ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. దీనిని చూస్తే విశాల్ కెరీర్ లో మరో మంచి మాస్ యాక్షన్ డ్రామా గా నిలుస్తుందని అనిపిస్తుంది. ఇక ఈ చిత్రంలో డింపుల్ హయతి హీరోయిన్ గా నటించనుండగా యువన్ శంకర్ రాజా సంగీతం అందివ్వనున్నాడు అలాగే ఈ చిత్రాన్ని కూడా విశాల్ నే నిర్మాణం వహించనున్నాడు.

సంబంధిత సమాచారం :