
తమిళ నటుడు విశాల్ మరోసారి తెలుగులో తన ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. గతంలో తను నటించిన ‘పందెంకోడి’, ‘పొగరు’, ‘భయ్యా’ సినిమాలు తెలుగులో కూడా అనువాదమయ్యి ఇక్కడ మంచి విజయాన్ని సాధించాయి. కానీ ఆతరువాత ‘సెల్యూట్’, ‘వాడు వీడు’ వంటి సినిమాలు పరాజయం పాలవ్వడంతో ఇక్కడ అతని మార్కెట్ పూర్తిగా పడిపోయింది. ఇప్పుడు అతని మరో సినిమా ‘ధీరుడు’ అనే పేరుతొ అనువాదానికి సిద్ధంగావుంది. ‘పట్టాతు ఎన్నై’ అనేది దీని తమిళ వెర్షన్ టైటిల్. విశాల్ మొదటిసారిగా తన సొంత నిర్మాణ సంస్థ అయిన విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ ద్వారా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. భూపతి పాండియన్ దర్శకుడు. థమన్ సంగీత దర్శకుడు. ఈ సినిమా ఆడియోను ఈ నెల 25న, సినిమాను వచ్చే నెలలో విడుదల చెయ్యనున్నారు. విశాల్ కు ఈ సినిమాతో మరో హిట్ రావాలని కోరుకుందాం.
మరోసారి తెలుగు మార్కెట్ పై కన్నేసిన తమిళ హీరో
మరోసారి తెలుగు మార్కెట్ పై కన్నేసిన తమిళ హీరో
Published on Jun 14, 2013 2:50 PM IST
సంబంధిత సమాచారం
- మొదటి షో వివరాలు : టాక్సిక్
- ‘అర్జున్ రెడ్డి’పై విజయ్ దేవరకొండ సాలిడ్ అప్డేట్..!
- ఆ సీక్వెన్స్ కోసం ‘రౌడీ జనార్దన’ మళ్లీ రెడీ !
- అభిమానులకు ‘టాక్సిక్’ నిర్మాతలు ప్రత్యేక విజ్ఞప్తి !
- 2026 కంబ్యాక్ నామ సంవత్సరం: వరుస హిట్స్ తో మళ్ళీ ఫామ్ లోకి పాపులర్ స్టార్స్
- షాకింగ్ : ‘స్పిరిట్’కు A సర్టిఫికెట్ ఖాయమని తేల్చిన సందీప్ రెడ్డి వంగా
- గంటలో లక్ష టికెట్ల అమ్మకం.. ‘టాక్సిక్’ తుఫానుకు అల్లాడుతున్న బాక్సాఫీస్..!
- టాక్సిక్ ఎఫెక్ట్ : రవితేజ సొంత థియేటర్లో ‘ఇరుముడి’ కంటే ఎక్కువ షోలు..!
- ట్రైలర్ టాక్ : యూత్‌ఫుల్ రైడ్‌ను సిద్ధం చేసిన ‘రోమాంచకం’
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- బన్నీ ‘రాకా’ పై మరో క్రేజీ రూమర్ ?
- రవితేజ ‘ఇరుముడి’ బాక్సాఫీస్ ర్యాంపేజ్: 3 రోజుల్లోనే రూ.30 కోట్ల షేర్ వసూళ్లు!
- నైజాంలో రవితేజ జోరు.. 3 రోజుల్లోనే భారీ వసూళ్లు !
- టాక్సిక్ : స్పెషల్ ప్రీమియర్ షోలకు అనుమతి.. అక్కడ టికెట్ రేటు ఎంతంటే..?
- ట్రైలర్ టాక్ : ఫుల్ ఎనర్టైన్మెంట్ తో ‘రంభ ఊర్వశి మేనక’
- స్వామి శరణం: నైజాంలో “ఇరుముడి” సెన్సేషన్.. వర్కింగ్ డేలో కూడా ట్రేడ్ షాకయ్యే వసూళ్లు!
- NBK111 కోసం రెండు టైటిల్స్..?
- ‘ఇరుముడి’ బాక్సాఫీస్ రికార్డులు: 4 రోజుల్లోనే 38 లక్షల టికెట్లు.. రూ.100 కోట్ల క్లబ్, ‘బాహుబలి 2’ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో ఆక్యుపెన్సీ

