నేటి సినిమా ఇండస్ట్రీని, ఇండస్ట్రీ మీద బ్రతుకుతున్న లక్షల కుటుంబాలను కలచివేస్తున్న భూతం పైరసీ. ఈ పైరసీని అరికట్టడానికి యాంటీ పైరసీ సెల్స్, టోల్ ఫ్రీ నెంబర్లు అంటూ రకరకాల మార్గాలు వున్నాయి. అయినా మన ఇండస్ట్రీకి, సినిమా కలెక్షన్లకు ఈ పైరసీ ప్రధాన అడ్డంకిగా మారింది. ఇటీవలే తమిళ హీరో విశాల్ తన సన్నిహితులతో కలిసి ఒక సి.డి షాప్ పై దాడి చేసారు. అక్కడ ‘పూజై’, ‘కత్తి’ వంటి తాజా సినిమా సిడీలు లభ్యమయ్యాయి
ఆ సీ.డిలను సీజ్ చేసి ఆ షాప్ ఓనర్ పై కేసు నమోదు చేసారు. ఈ ఘటనలో విడుదలైన వీడియోలో విశాల్ చాలా కోపంగా కనిపించాడు. షాప్ కుర్రాడని లెక్కలేనన్ని ప్రశ్నలు అడుగుతూ సినిమా వారి వేదనను తెలిపాడు. ఏటికేటికీ ఈ పైరసీ పెద్ద సమస్యగా మారిపోతుంది. టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ‘అత్తారింటికి దారేది’ సినిమా కూడా ఈ పైరసీ భారిన పడి విడుదలకు ముందే మొదటిభాగాన్ని ఇంటర్నెట్ లో పెట్టిన పరిస్థితిని ఎదుర్కుంది


