
ప్రస్తుతం తెలుగు, తమిళ్ లో విజయం సాధించి మంచి ఊపుమీదున్న విశాల్ కు మరో పురస్కారం వరించింది. భారతదేశంలో పశువుల సంరక్షణ కోసం కోసం స్థాపించిన పీపుల్ ఫర్ కాటిల్ ఇన్ ఇండియా (పీఎఫ్‌సీఐ) ప్రతి సంవత్సరం జంతుసంరక్షణ కొసం కృషి చేసిన కొంతమందికి పురస్కారం అందిస్తున్నది. 2012 ఏర్పడిన పీపుల్ ఫర్ కాటిల్ ఇన్ ఇండియా (పీఎఫ్‌సీఐ) సంస్థ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని సినీనటుడు విశాల్‌కు పీఎఫ్‌సీఐ పురస్కారాన్ని తమిళనాడు గవర్నర్ రోశయ్య అందజేశారు. అలా ఈ సంవత్సరం ఈ పురస్కారం పొందిన వారిలో హీరో విశాలో తో పాటు హీరోయిన్ వరలక్ష్మి, సామాజికవేత్తలు సూర్య, నిషాసింగ్ తదితరులు ఈ పురస్కారాలను అందుకున్నారు.
ఇది ఇలా ఉండగా తెలుగులో విశాల్‌కు మంచి వసూళ్లు సాధించిన సినిమాగా ’రాయుడు’ నిలిచింది. గత నెల 27 న విడుదలైన ఈ సినిమా తెలుగులో ఇప్పటి వరకూ ఏపీ, తెలంగాణా రెండు రాష్ట్రాల్లో కలుపుకొని 5 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసిందని సమాచారం. ముత్తయ్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విశాల్ పూర్తి మాస్ క్యారెక్టర్లో కనిపించగా విశాల్ సరసన ’మనసారా’ ఫేం శ్రీ దివ్య హీరోయిన్గా నటించారు.