మళ్ళీ షూటింగ్లో పాల్గొంటున్న విశాల్ !

Published on Apr 1, 2019 4:11 pm IST

యాక్షన్ హీరో విశాల్ ప్రస్తుతం సుందర్ సి తో ఓ సినిమా చేస్తున్నాడు. ఇటీవల ఈసినిమా షూటింగ్ లో గాయపడ్డ విశాల్ కోలుకొని తిరిగి మళ్ళీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ చిత్రం యొక్క కొత్త షెడ్యూల్ ఈ రోజు అజర్బైజాన్ లో స్టార్ట్ అయ్యింది. ఈ షెడ్యూల్ లో రెండు పాటలను అలాగే యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరించనున్నారు. దాంతో ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తి కానుంది.

ఈ చిత్రంలో విశాల్ కు జోడీగా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తుంది. కాగా వీరిద్దరు కలిసి నటించడం ఇది రెండవ సారి. ఇంతకుముందు వీరు జంటగా నటించిన కత్తిసందై (ఒక్కడొచ్చాడు) డిజాస్టర్ అయ్యింది. మరి ఈ చిత్రంతోనైనా ఈ జోడి హిట్ పెయిర్ అనిపించుకుంటారో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :