పాటలు విడుదలకు సిద్దమైన ‘పందెం కోడి 2′ !

పాటలు విడుదలకు సిద్దమైన ‘పందెం కోడి 2′ !

Published on Sep 22, 2018 3:31 PM IST


యాక్షన్ హీరో విశాల్ ‘పందెంకోడి’ సినిమాతోనే ఆయన తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరయ్యారు. కాగా ఆ చిత్రం వచ్చిన పన్నెండు సంవత్సరాలకి ఇప్పుడు సీక్వెల్‌గా ‘పందెం కోడి 2’ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో విశాల్ సరసన కీర్తి సురేష్ జోడిగా నటిస్తోంది. లింగు సామి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ సినిమా పాటలను ఈ నెల 24వ తేదీన విడుదల చేయనున్నారని చిత్రబృందం పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది

ఈ చిత్రానికి సంభందించిన ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు హీరో విశాల్. ”పందెం కోడి” చిత్రం ఇక్కడ ఘన విజయాన్ని సాధించింది. దాంతో పందెంకోడి 2 చిత్ర తెలుగు హక్కులను భారీ ధరకు దక్కించుకున్నారు ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు. కాగా విజయదశమి కానుకగా అక్టోబర్ 18న తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం ఒకేసారి విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు