2005లో లింగు సామి దర్శకత్వంలో విశాల్ హీరోగా తెరకెక్కించిన చిత్రం ‘పందెంకోడి’. ఈసినిమా తెలుగు , తమిళంలో సంచలన విజయాన్ని సాధించింది. ఈచిత్రం తోనే విశాల్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఇన్ని రోజులతరువాత ఈ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కింది ‘పందెంకోడి 2’ . ఈచిత్రం యొక్క ట్రైలర్ ను ఈ రోజు హైదరాబాద్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ ‘పందెంకోడి’ చిత్రాన్ని నేను చేయకుండా వుండి ఉంటే ఎన్టీఆర్ , రామ్ చరణ్ లలో ఎవరో ఒకరు ఈచిత్రాన్ని చేసివుండేవారు. అప్పటికే వారిద్దరూ ఈ స్క్రిప్ట్ కోసం తిరుగుతున్నారని కాని నాన్న ఇవ్వలేదని విశాల్ గుర్తుచేసుకున్నాడు. అలాగే ఈ పందెంకోడి2 కూడా దానికి మించి ఉంటుందని ఆయన అన్నారు.
ఇక ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా రానున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటించగా , వరలక్ష్మి శరత్ కుమార్ ప్రతినాయకురాలి పాత్రలో కనిపించనుంది. ఈచిత్రం అక్టోబర్ 18న విడుదలకానుంది.


