ఈరోజే లాంచ్ అయిన విశాల్ 31వ సినిమా.!

Published on May 6, 2021 5:15 pm IST

కోలీవుడ్ యాక్షన్ హీరో విశాల్ కు తన మొదటి సినిమాతోనే తెలుగులో కూడా మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. అక్కడ నుంచి ఆల్ మోస్ట్ తన సినిమాలు అన్ని తెలుగులో విడుదల అయ్యాయి. అయితే కోలీవుడ్ లో స్థిర పడ్డ ఈ తెలుగు హీరో ఇప్పుడు తన 31వ ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేసేసాడు. ఇటీవల “చక్ర” సినిమాతో తెలుగు మరియు తమిళ్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశాల్ ఈసారి వేరే సబ్జెక్ట్ టేకప్ చేసినట్టు తెలుస్తుంది.

దర్శకుడు తుపాశరవణ తెరకెక్కించనున్న ఈ చిత్రం ఈరోజే ముహూర్తంతో లాంచ్ అయ్యింది. మరి అలాగే ఈ చిత్రానికి గాను యంగ్ బ్యూటీ డింపుల్ హయతిని హీరోయిన్ గా తీసుకున్నట్టు చిత్ర యూనిట్ తెలిపారు. అలాగే ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ యువన్ శంకర రాజానే సంగీతం అందిస్తుండగా విశాల్ నిర్మాణ సంస్థలోనే నిర్మాణం వహించనున్నట్టు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :