తమిళనాడులో కుదరక హైదరాబాద్ చేరుకున్న విశాల్

Published on Jun 17, 2021 1:12 am IST

విశాల్ ఇటీవలే కొత్త చిత్రాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ చిత్రానికి శరవణన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది విశాల్ యొక్క 31వ చిత్రం. నాట్ ఏ కామన్ మ్యాన్ అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్. మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన యువకుడు అధికార దుర్వినియోగాన్ని ప్రశ్నించడమే ఈ సినిమా కథాంశం. షూటింగ్ మొదలైన కొద్దిరోజులకే లాక్ డౌన్ పడటంతో చిత్రీకరణ ఆగిపోయింది. ఇంకా తమిళనాడులో చిత్రీకరణలకు అనుమతి ఇవ్వలేదు ప్రభుత్వం. దీంతో అక్కడ షూటింగ్ చేయడానికి లేదు. అందుకే విశాల్ తన బృందంతో హైదరాబాద్ చేరుకున్నారు.

హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ స్టార్ట్ చేశారు. మొదట యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. సింగిల్ షెడ్యూల్లో సినిమాను ముగించాలనేది విశాల్ ప్లాన్. జూలై నెలాఖరు వరకు ఈ షెడ్యూల్ సాగనుంది. అన్ని జాగ్రత్తలు తీసుకుని చిత్రీకరణ చేస్తున్నారు. విశాల్ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో డింపుల్ హయాతీ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా మీద, దర్శకుడు శరవణన్ మీద విశాల్ చాలా నమ్మకంగా ఉన్నారు. అందుకే ముందుగా ఈ చిత్రాన్ని ఫినిష్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :