విశాల్ ‘టెంపర్’కి రిలీజ్ డేట్ ఫిక్స్ !

Published on Apr 9, 2019 1:00 am IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ – స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కలయికలో వచ్చిన ‘టెంపర్’ సినిమా తమిళంలో రీమేక్ అవుతోన్న విషయం తెలిసిందే. కాగా తమిళ్ రీమేక్ లో ‘అయోగ్య’ టైటిల్ తో విశాల్ మరియు రాశి ఖన్నా హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా తాజాగా ఈ చిత్రం విడుదల తేదీని ఖరారు చేసుకుంది. ఈ సినిమా మే 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఇక ఇప్పటికే విడుదల అయిన టీజర్ ట్రైలర్ లో మూవీ కాన్సెప్ట్ తో పాటు విశాల్ కూడా బాగా హైలెట్ గా నిలిచాడు. విశాల్ లోని మాస్ ఆటిట్యూడ్ తో పాటు యాక్షన్ అంశాలను సినిమాలో బాగా ఎలివేట్ చేశారట. ఎన్టీఆర్ ను హిట్ ట్రాక్ ఎక్కించిన ఈ సినిమా విశాల్కి కూడా హిట్ ఇస్తోంది ఏమో చూడాలి.

సంబంధిత సమాచారం :