విశాల్ ఆ తెలుగు సినిమాను రీమేక్ చేద్దాం అనుకున్నాడట !

విశాల్ ఆ తెలుగు సినిమాను రీమేక్ చేద్దాం అనుకున్నాడట !

Published on Oct 27, 2018 7:00 PM IST

vishal1

యాక్షన్ హీరో విశాల్ ప్రస్తుతం సీక్వెల్స్ అలాగే రీమేక్ లపై పడ్డాడు. ఇటీవల ‘పందెం కోడి’ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన ‘పందెంకోడి 2’ చిత్రంతో ప్రేక్షకులముందుకు వచ్చిన అయన తాజాగా తెలుగు సూపర్ హిట్ చిత్రం ‘టెంపర్’ రీమేక్ లో నటిస్తున్నాడు. ఈచిత్రం అక్కడ ‘అయోగ్య’పేరుతో రీమేక్ అవుతుంది.

ఇక ఈసినిమా కు ముందు మరి కొన్ని తెలుగు సినిమాలను రీమేక్ చేయాలనుకున్నాడట విశాల్. అందులో మొదటగా తెలుగులో ప్రభాస్ నటించిన ‘మిర్చి’ చిత్రాన్ని రీమేక్ చేయాలనుకున్నానని అయితే టెంపర్ లో వున్న సోషల్ కాజ్ నచ్చి ఇప్పుడు ఆచిత్రాన్ని రీమేక్ చేస్తున్నాని తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు