షూటింగ్ లో గాయపడ్డ యాక్షన్ హీరో !

Published on Mar 28, 2019 10:00 am IST

యాక్షన్ హీరో విశాల్ ప్రస్తుతం సుందర్ సి తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈచిత్రం యొక్క షూటింగ్ టర్కీ లో జరుగుతుంది. యాక్షన్ సీక్వెన్స్ లో భాగంగా విశాల్ నడుపుతున్న ఏటీవీ బైక్ యాక్సిడెంట్ కు గురైయింది. ప్రాణాపాయం నుండి తప్పించుకున్న విశాల్ గాయాలతో బయటపడ్డాడు. దాంతో వెంటనే విశాల్ ను స్థానిక హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

ట్రైడెంట్ ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో విశాల్ కు జోడీగా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తుండగా ఐశ్వర్య లక్ష్మి ముఖ్య పాత్రలో కనిపించనుంది. ఇక విశాల్ ఇటీవలే అయోగ్య షూటింగ్ ను పూర్తీ చేశాడు. సూపర్ హిట్ తెలుగు మూవీ టెంపర్ కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం మే లో విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :

More