విశాల్ తో జతకట్టనున్న కాజల్

విశాల్ తో జతకట్టనున్న కాజల్

Published on Jan 10, 2015 1:37 AM IST

Kajal-Agarwal-and-vishal
తెలుగులో వరుసపెట్టి సినిమాలు చేసుకోస్తున్న భామలలో కాజల్ ఒకరు. తెలుగేకాక తమిళ, హిందీ పరిశ్రమలలో కూడా ఈ ముద్దుగుమ్మ బానే రాణిస్తుంది. ప్రస్తుతం తారక్ తో ‘టెంపర్’, ధనుష్ తో ‘మారి’ మరియు మరో రెండు హిందీ సినిమాలలో నటిస్తుంది. ఇప్పుడు సుసీంద్రన్ దర్శకత్వంలో విశాల్ సరసన నటించడానికి పచ్చ జెండా ఊపింది

సుసీంద్రన్, విశాల్ గతంలో ‘పల్నాడు’ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ఈ కొత్త ప్రాజెక్ట్ షూటింగ్ జనవరి 26 నుండి మొదలుకానుంది. హైదరాబాద్ లో ఒక భారీ షెడ్యూల్ ని చిత్ర బృందం ప్లాన్ చేసినట్టు సమాచారం. ఈరోజు విశాల్ నటించిన ‘మగమహారాజు’ ఆడియో విడుదలవేడుక జరిగింది

తాజా వార్తలు