షార్ట్ ఫిల్మ్‌తోనే ₹10 కోట్ల ఫీచర్ ఫిల్మ్ ఛాన్స్ ఇస్తున్న అవా కాంటెస్ట్ సీజన్ – 1

షార్ట్ ఫిల్మ్‌తోనే ₹10 కోట్ల ఫీచర్ ఫిల్మ్ ఛాన్స్ ఇస్తున్న అవా కాంటెస్ట్ సీజన్ – 1

Published on Jan 16, 2026 9:10 AM IST

సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఉన్న ఔత్సాహిక ఫిల్మ్ మేకర్లు, కొత్త ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలనే లక్ష్యంతో అవా ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ – సీజన్ 1ను ప్రకటించారు. ఈ విషయమై అవా ఎంటర్‌టైన్‌మెంట్స్ అధికారికంగా కీలక ప్రకటన చేసింది. రియాలిటీ ఫార్మాట్‌లో రూపొందిన ఈ పోటీలో పాల్గొనే ఆశావహ దర్శకులు గరిష్టంగా 10 నిమిషాల నిడివి గల షార్ట్ ఫిల్మ్‌లను సమర్పించాల్సి ఉంటుంది. కథనం, దర్శకత్వ ప్రతిభే ఈ పోటీలో ప్రధాన ప్రమాణాలుగా నిలవనున్నాయి.

ఈ పోటీలో విజయం సాధించిన దర్శకుడికి రూ.10 కోట్ల బడ్జెట్‌తో ఫీచర్ ఫిల్మ్ రూపొందించే అవకాశాన్ని నటుడు, నిర్మాత మంచు విష్ణు అందించనున్నారు. కొత్త ప్రతిభకు ఎప్పటికప్పుడు అండగా నిలిచే విష్ణు, ఈ కార్యక్రమం ద్వారా మరోసారి తన నిబద్ధతను చాటుకున్నారు. అర్హత కలిగిన యువ దర్శకులను మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లోకి తీసుకురావడమే ఈ కాంటెస్ట్ యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ఈ ప్రాజెక్ట్‌తో అవా ఎంటర్‌టైన్‌మెంట్స్ భారతీయ సినీ పరిశ్రమకు కొత్త టాలెంట్‌ను పరిచయం చేయాలన్న సంకల్పాన్ని మరింత బలపరుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు