‘సీఎం’ పై సీరియస్ అయిన మంచు విష్ణు !

‘సీఎం’ పై సీరియస్ అయిన మంచు విష్ణు !

Published on Mar 9, 2019 3:18 AM IST

vishnu manchu

మంచు ఫ్యామిలీ శ్రీవిద్యానికేతన్ సంస్థల్ని నడిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ సంస్థకు విద్యా రంగంలో మంచి పేరు కూడా ఉంది. ఇక ఇటివలే మోహన్ బాబు ఇంజనీరింగ్ కళాశాలల ఫీజు రీయింబర్స్మెంట్స్ విషయంలో తమ సంస్థకు రావాల్సిన బకాయిలు గురించి ప్రెస్ మీట్ పెట్టిమరీ చంద్రబాబుని నిలదీశారు. కాగా తాజాగా మంచు విష్ణు కూడా బాబు ప్రభుత్వం పై విమర్శలు చేశారు.

విద్యార్ధుల ఫీజు రీయింబర్స్మెంట్స్ విషయంలో 2017-2018 సంవత్సరాలకు గానూ ఫీజ్ ను ప్రభుత్వం ఇంకా చెల్లించలేదనే మాట అక్షర సత్యం అని మంచు విష్ణు అన్నారు. ముఖ్యమంత్రితో మంచి సంబంధాలు ఉన్న వారికీ మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్స్ బకాయిలు అందుతున్నాయని విష్ణు ఆరోపించారు.

తాజా వార్తలు