కలెక్షన్ కింగ్ డా. ఎమ్. మోహన్ బాబు తనయుడుగా ఇండస్ట్రీకి పరిచయమైన మంచు విష్ణు మొదటి నుంచి తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేస్తూ వచ్చాడు. నటుడిగా మారిన కొద్ది రోజులకే నిర్మాతగా కూడా మారి రెండు బాధ్యతలను ఎంతో సమర్ధవంతంగా నిర్వహిస్తున్నాడు. కానీ మంచు విష్ణు ఇప్పటి వరకూ తను నటించిన లేదా తన ఫ్యామిలీ హీరోస్ నటించిన సినిమాలనే తన 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మించాడు.
కానీ తాజా సమాచారం ప్రకారం మంచు విష్ణు మొదటి సారి వేరే హీరోలతో సినిమా నిర్మించనున్నాడు. ‘త్వరలోనే నేనొక సర్ప్రైజ్ ఇవ్వనున్నాను. టాలీవుడ్ లోని బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ తో నా హోం ప్రొడక్షన్ లో సినిమా చేస్తున్నాను. ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి త్వరలో అనౌన్స్ చేస్తానని’ మంచు విష్ణు అన్నాడు. మంచు విష్ణు ప్రస్తుతం మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న ‘కరెంట్ తీగ’ సినిమాలో నటిస్తున్నాడు.
ఇది కాకుండా అమంచు విష్ణు హీరోగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘అనుక్షణం’ సెప్టెంబర్ 12న రిలీజ్ కానుంది. ఈ సినిమా తనకి నటుడిగా మరింత గుర్తింపు తెస్తుందని మంచు విష్ణు అంటున్నాడు.


