నా సినిమాకి కావాలనే నెగెటివిటీ తెస్తున్నారు : విశ్వ‌క్‌సేన్‌

Published on Jun 3, 2019 4:20 pm IST

గత వారంలో విడుదలైన సినిమాల్లో ‘ఫలక్‌నుమా దాస్’ కూడా ఒకటి. ఈ చిత్ర దర్శకుడు, హీరో విశ్వ‌క్‌సేన్‌ సినిమా ప్రమోషన్లలో భాగంగా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా చిన్నపాటి వీడియో ఒకదాన్ని రిలీజ్ చేశారు. అందులో ఆయన కొంత బాడ్ లాంగ్వేజ్ వాడటం జరిగింది. దాంతో వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయి విశ్వ‌క్‌సేన్‌ పలానా హీరో అభిమానుల్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారనే ప్రచారం మొదలై వివాదం ముదిరింది.

దీంతో విశ్వ‌క్‌సేన్‌ స్వయంగా మీడియా ముందుకొచ్చి క్లారిటీ ఇచ్చారు. తానూ ఎవ్వరినీ కావాలని తిట్టలేదని, ఆ అవసరం కూడా తనకు లేదని అన్నారు. ఇక వీడియోలో బాడ్ లాంగ్వేజ్ వాడినందుకు సారీ చెబుతూ కొంతమంది పనిగట్టుకుని సినిమాకి నెగెటివిటీ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. థియేటర్ల వద్ద లక్షలు పెట్టి ఏర్పాటు చేసిన హోర్డింగులు చింపేశారు. వాళ్లెవరో నాకూ తెలీదు. కోపంలో వాళ్ళను ఉద్దేశించే ఆ మాటలు మాట్లాడాను. ప్రేక్షకుల్ని, రివ్యూ రైటర్లని తిట్టానని అంటున్నారు. అందులో నిజం లేదు. సినిమా బాగుంది కాబట్టే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు అంటూ సమస్యకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు.

సంబంధిత సమాచారం :

More