హిట్టు కోసం విశ్వక్ పట్టు.. ‘ఫంకీ’తో సక్సెస్ దక్కేనా..?

హిట్టు కోసం విశ్వక్ పట్టు.. ‘ఫంకీ’తో సక్సెస్ దక్కేనా..?

Published on Jan 22, 2026 12:30 AM IST

Funky

సంక్రాంతి సందడి తర్వాత బాక్సాఫీస్ ప్రస్తుతం సైలెంట్‌గా ఉంది. జనవరి నెలాఖరులో తరుణ్ భాస్కర్ ‘ఓం శాంతి శాంతి శాంతిః’ తప్ప పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో అందరి చూపు ఇప్పుడు ఫిబ్రవరి 13న విడుదలయ్యే విశ్వక్ సేన్ ‘ఫంకీ’(Funky) పైనే ఉంది. అనుదీప్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం వాయిదా పడే ఛాన్స్ లేదని ఇటీవల ఓ పోస్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు.

గతేడాది వచ్చిన ‘లైలా’ డిజాస్టర్ కావడంతో విశ్వక్ ఈ మూవీపైనే ఆశలు పెట్టుకున్నాడు. ఆ విమర్శల తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న ఆయన, రీసెంట్‌గా ‘లెగసీ’ అనే పొలిటికల్ థ్రిల్లర్‌ను కూడా స్టార్ట్ చేసి అప్పుడే సగం షూటింగ్ పూర్తి చేశాడు. సక్సెస్ కొట్టాలనే పట్టుదలతో ‘ఫంకీ’ కోసం విశ్వక్ గట్టిగానే కష్టపడ్డాడు. ‘జాతిరత్నాలు’ తర్వాత అనుదీప్ కూడా హిట్ కోసం ఈ ఫన్ సబ్జెక్ట్‌ను నమ్ముకున్నాడు.

ఈ సినిమాలో విశ్వక్ సినిమా దర్శకుడిగా కనిపించబోతున్నాడు. అందాల భామ కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే రిలీజ్‌కు సమయం తక్కువగా ఉన్నందున ప్రమోషన్స్ పెంచాల్సి ఉంది. దీనికి పోటీగా మరుసటి రోజున ‘సీతా పయనం’, ‘కపుల్ ఫ్రెండ్లీ’ వంటి సినిమాలు కూడా లైన్లో ఉన్నాయి. మరి ఈ పోటీలో ‘ఫంకీ’ ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు