మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఫంకీ’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. జాతిరత్నాలు ఫేమ్ దర్శకుడు కెవి అనుదీప్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. ఇక ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ తాజాగా ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు.
ఫంకీ చిత్ర రిలీజ్ డేట్‌ను వారు తాజాగా ప్రకటించారు. ఈ సినిమాను ఫిబ్రవరి 13న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయింది. వాలెంటైన్స్ డే ట్రీట్‌గా ఈ చిత్రాన్ని అందిస్తుండగా.. అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైనర్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు మేకర్స్. ఇక విశ్వక్ పాత్ర ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఈ సినిమాలో అందాల భామ కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తుండటంతో వీరి మధ్య కెమిస్ట్రీ ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య ప్రొడ్యూస్ చేస్తున్నారు.


