మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘లైలా’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితాన్ని రాబట్టిందో అందరికీ తెలుసు. ఈ సినిమాపై చిత్ర యూనిట్ భారీ అంచనాలు పెట్టుకున్నా, ఫలితం మాత్రం శూన్యం గా నిలిచింది. ఎంతలా అంటే, ఇలాంటి సినిమాలు ఇకపై చేయబోనని హీరో ఓపెన్ లెటర్ రాసేలా.
అయితే, ఆట అక్కడితో ఆగిపోలేదని పలువురు అంటున్నారు. ఇప్పుడు లైలా చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అవుతుందట. సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాగూ బోల్తా కొట్టిందని చాలా మంది ఈ సినిమాను థియేటర్లలో చూడలేదు. ఇక ఓటీటీలోకి వచ్చాక ఇంకాస్త ఎక్కువ మంది ప్రేక్షకులు ఈ సినిమాను వీక్షిస్తారు.
దీంతో, ఈ సినిమాపై అసలైన ట్రోలింగ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుందని అందరూ అంటున్నారు. ఈ చిత్ర ఓటీటీ రైట్స్ దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్ వీడియో మార్చి 7 నుంచి ఈ చిత్రాన్ని ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నట్లు టాక్. దీంతో విశ్వక్‌కు అసలైన పరీక్ష ముందున్నది అభిమానులు కామెంట్ చేస్తున్నారు.