నాచురల్ స్టార్ నాని ప్రొడ్యూసర్ గా మారిన సంగతి తెలిసిందే. వాల్ పోస్టర్ సినిమా అనే ఓ బ్యానర్ ప్రారంభించిన ఆయన మొదటి ప్రయత్నంగా ‘అ..!’ అనే ఓ ప్రయోగాత్మక చిత్రం తీశారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బెస్ట్ మేకప్, విజువల్ ఎఫెక్ట్స్ అనే రెండు విభాగాలలో నేషనల్ అవార్డ్స్ అందుకోవడం విశేషం. కాగా ఈ బ్యానర్ లో నాని తన రెండవ చిత్రంగా హిట్ అనే టైటిల్ తో నిర్మిస్తున్నారు.
ఈ నగరానికి ఏమైంది..?, ఫలక్ నుమా దాస్ వంటి చిత్రాలలో నటించిన హీరో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ జరుపుకుంటుంది. కాగా నేడు ఈ మూవీ నుండి విశ్వక్ సేన్ లుక్ విడుదల చేశారు. కాగా విశ్వక్ హిట్ మూవీలో విక్రమ్ రుద్రరాజు అనే సీరియస్ ఐ పి ఎస్ అధికారి పాత్ర చేస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ గ్లిమ్ప్స్ వీడియో 2020 జనవరి 1న న్యూ ఇయర్ కానుకగా విడుదల చేయనున్నారు. హిట్ మూవీకి డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు.


