సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘పేట’ అలాగే తల అజిత్ నటించిన ‘విశ్వాసం’ ఒకే రోజు విడుదలయ్యాయి. ఈరెండు చిత్రాలు కూడా తమిళ ప్రేక్షకులనుండి పాజిటివ్ టాక్ ను సొంతంచేసుకున్నాయి. దాంతో కోలీవుడ్ బాక్సాఫిస్ వద్ద రెండు చిత్రాలు మంచి వసూళ్లను రాబడుతున్నాయి. రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా పేట చిత్రం 65కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టగా విశ్వాసం 59కోట్ల గ్రాస్ వసూళ్లను కలెక్ట్ చేసింది. అయితే విశ్వాసం తెలుగులో ఇంకా విడుదలకాలేదు. ఇక పండుగ సీజన్ కాబట్టి ఈ రెండు చిత్రాలు ఇంకా మంచి వసూళ్లను రాబట్టుకునే అవకాశం వుంది.
ఇక తెలుగు రాష్ట్రాల్లో పేట విడుదలై యావరేజ్ టాక్ ను తెచ్చుకొని రెండు రోజులకు గాను 4.65కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. తెలుగుచిత్రాల నుండి ఈ చిత్రానికి గట్టి పోటీ ఎదురవుతుంది. ముఖ్యంగా రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ నిన్న విడుదలకావడంతో రెండో రోజు పేట కలెక్షన్స్ భారీ గా డ్రాప్ అయ్యాయి.


