విశ్వాసం షూటింగ్ అప్ డేట్స్ !

విశ్వాసం షూటింగ్ అప్ డేట్స్ !

Published on Sep 18, 2018 4:18 PM IST

తల అజిత్ నటిస్తున్న ‘విశ్వాసం’ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైద్రాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. గత కొద్దిరోజులుగా అక్కడే భారీ షెడ్యూల్ ను జరుపుకుంటుంది ఈ చిత్రం. ప్రస్తుతం సినిమాలోని పోరాటసన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. స్టంట్ మాస్టర్ దిలీప్ సుబ్బరాయణ్ నేతృత్వంలో అజిత్ తో పాటు విలన్ గ్యాంగ్ ఫై ఈ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నారు.

శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అజిత్ డ్యూయెల్ రోల్లో నటిస్తున్నాడు. అందులో ఒకటి 30 సంవత్సరాల యువకుడి పాత్ర కాగా మరొకటి 60సంవత్సరాల వృద్ధుడి పాత్ర. ఈరెండు పాత్రలతో ఆయన ప్రేక్షకులకు ఎంటర్టైన్ చేయనున్నారు. నయనతార కథనాయికగా నటిస్తున్న ఈచిత్రాన్ని సత్యజ్యోతి ఫిలిమ్స్ నిర్మిస్తుంది. ఫుల్ యాక్షన్ ఎంటెర్టైనెర్ గా రూపొందుతున్న ఈచిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు