భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న విశ్వ కార్తికేయ చిత్రం!

Published on Jul 2, 2021 6:59 pm IST


తెలుగు చిత్ర పరిశ్రమ లో బాల నటుడు నుండి వెండితెర పై స్టార్ హీరో గా వెలిగిన వారు ఎంతోమంది ఉన్నారు. అయితే బాల నటుడు గా విశ్వ కార్తికేయ జానకి వెడ్స్ శ్రీరాం చిత్రం లో నటించారు. అయితే ఈ చిత్రం నుండి ఆ నలుగురు, గోరింటాకు, లేత మనసులు, శివ శంకర్, అధినాయకుడు లాంటి పేరొందిన చిత్రాలతో పాటుగా దాదాపు 50 చిత్రాల్లో బాల నటుడి గా వెలుగొందారు. అయితే అద్దిరిపోయే ఫిజిక్ తో అటు డ్యాన్స్ లోనూ, ఇటు ఫైట్స్ లోనూ తన ఈజ్ ను కనబరుస్తూ సత్తా చాటుతున్నాడు. అయితే ప్రస్తుతం సరికొత్త ప్రేమ కథ తో మన ముందకు హీరో గా వచ్చేందుకు సిద్దం అయ్యారు.

RR క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ పై ఎన్. చంద్ర మోహన్ రెడ్డి నిర్మాతగా చలపతి పువ్వుల దర్శకత్వం లో ఒక సినిమా తెరకెక్కనుందీ. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో తో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం లో విశ్వ కార్తికేయ హీరో గా నటిస్తున్నారు. ప్రొడక్షన్ నంబర్ 1 గా ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. అయితే ఈ చిత్రం కి సంగీత దర్శకుడు రధన్ సంగీతం అందిస్తున్నారు. జూలై మూడవ తేదీ పుట్టిన రోజు జరుపుకుంటున్న విశ్వ కార్తికేయ కి సినీ పరిశ్రమ కి చెందిన వారు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

సంబంధిత సమాచారం :