కొత్త సినిమా ప్రకటించనున్న ఫలక్ నుమా దాస్.

Published on Mar 18, 2020 11:49 am IST

విశ్వక్ సేన్ వరుసగా అవకాశాలు అందిపుచ్చుకుంటూ టాలీవుడ్ లో ముందుకెళుతున్నాడు. ఆయన తన 5వ చిత్రాన్ని రేపు ప్రారంభించనున్నారు. నూతన దర్శకుడు నరేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా నిర్మాత బెక్కం వేణు గోపాల్ లక్కీ మీడియా బ్యానర్ లో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం రాధన్ అందిస్తున్నారు. ఇతర నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సివుంది.

ఇక విశ్వక్ గత ఏడాది ఫలక్ నుమా దాస్ అనే చిత్రాన్ని విడుదల చేశారు. నాని నిర్మాతగా తెరకెక్కిన హిట్ మూవీ ఇటీవల విడుదలై డీసెంట్ టాక్ తెచ్చుకుంది. సస్పెన్సు క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ మూవీలో విశ్వక్ సేన్ పోలీస్ అధికారి పాత్ర చేశారు. హిట్ మూవీలో రుహని శర్మ హీరోయిన్ గా నటించింది.

సంబంధిత సమాచారం :