ఎలాంటి యాక్టింగ్ అయినా అంటే ఎన్టీఆర్ నే – విశ్వక్ సేన్

Published on May 5, 2021 4:00 pm IST

మన టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటన ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎలాంటి పాత్రను అయినా సరే సంపూర్ణంగా ఎక్కడా వంక పెట్టని విధంగా రక్తి కట్టించగల అద్భుత నటుడు. మరి అలాంటి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు తాను కూడా అభిమానినే అని యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ కూడా చెప్పిన పలు సందర్భాలు ఉన్నాయి.

మరి లేటెస్ట్ గా మరోసారి విశ్వక్ తనకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటన అంటే ఎందుకు అంత ఇష్టమో తెలిపాడు. ఈటీవీలో ప్రసారం అయ్యే “ఆలీతో సరదాగా” షోకి తన “పాగల్” ప్రమోషన్స్ లో భాగంగా వెళ్లిన విశ్వక్ తన చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ కి ఫ్యాన్ నే అని “సింహాద్రి” టైం నుంచే తారక్ నటన అంటే ఇష్టమని తెలిపాడు.

అంతే కాకుండా తెలుగులో పర్ఫెక్ట్ గా డైలాగ్ చెప్పగలిగే హీరో ఎన్టీఆర్ అని అలాగే హానెస్ట్ యాక్టర్ ఎవరు అంటే ఇంకో పేరు లేదు ఎన్టీఆర్ నే అని చెప్పాడు. అలాగే ఎంత మంచి యాక్టర్ అయినా కూడా కొన్ని కమెర్షియల్ సినిమాలు అంటే నటన పరంగా కొంచెం ఫేకిజం వస్తుంది కానీ అలాంటి కమెర్షియల్ సినిమాల్లో మంచి ఎమోషన్స్ తో కన్విన్సింగ్ యాక్టింగ్ చెయ్యాలి అంటే ఆయననే అని విశ్వక్ ఎన్టీఆర్ నటనపై తన వ్యూ అద్భుతంగా చెప్పాడు.

సంబంధిత సమాచారం :