“గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” నుండి ఆకట్టుకుంటున్న విశ్వక్ లేటెస్ట్ పోస్టర్!

“గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” నుండి ఆకట్టుకుంటున్న విశ్వక్ లేటెస్ట్ పోస్టర్!

Published on Mar 29, 2024 5:00 PM IST

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Viswak sen) ప్రధాన పాత్రలో, డైరెక్టర్ కృష్ణ చైతన్య దర్శకత్వం లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs of godavari). ఈ చిత్రం ను మే 17, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. నేడు విశ్వక్ సేన్ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ ఈ చిత్రం నుండి సరికొత్త పోస్టర్ ను విడుదల చేసారు.

హ్యాపీ బర్త్ డే టు అవర్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ అంటూ మేకర్స్ పోస్టర్ లో తెలిపారు. రిలీజ్ చేసిన పోస్టర్ లో విశ్వక్ పవర్ ఫుల్ గా, మాస్ గెటప్ లో ఆకట్టుకుంటున్నారు. నేహ శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు