మరో మాస్ టైటిల్ తో విశ్వక్ సేన్ సరికొత్త ప్రాజెక్ట్.!

Published on Mar 9, 2022 9:52 am IST

మన టాలీవుడ్ యంగ్ అండ్ స్టార్ హీరో హీరోస్ లో యూత్ లో మంచి క్రేజ్ ఉన్న మరో హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కూడా ఒకడు. తన కెరీర్ లో ఇంట్రెస్టింగ్ లైనప్ తో వెళ్తున్న విశ్వక్ సేన్ కి మాస్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే తాను తీసిన సినిమాల్లో “ఫలక్ నామ దాస్” మంచి మాస్ సినిమాగా తనకి గుర్తింపు తెచ్చింది.

ఇప్పుడు తన సరికొత్త ప్రాజెక్ట్ ని కూడా తన మార్క్ టైటిల్ తో అనౌన్స్ చేసాడు. ఈ సినిమాకి “దాస్ కా ధమ్కీ” అనే మాస్ టైటిల్ ని ఫిక్స్ చెయ్యగా మరి ఈ చిత్రానికి నరేష్ కుప్పిలి దర్శకత్వం వహించనుండగా ప్రసన్న కుమార్ బెజవాడ కథ, మాటలు అందిస్తున్నారు.

ఇక ఈ సినిమాతో విశ్వక్ సరసన మరోసారి నివేతా పెత్తురాజ్ హీరోయిన్ గా నటిస్తుండగా వణ్మయి క్రియేషన్స్ మరియు విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు. అలాగే ఇంట్రెస్టింగ్ కామెడీ థ్రిల్లర్ గా ఈ సినిమాని ప్లాన్ చేస్తుండగా ఈ మార్చ్ 14 నుంచి రెగ్యులర్ షూట్ ని ఈ చిత్రం స్టార్ట్ చేసుకోనుంది.

సంబంధిత సమాచారం :