నైజాంలో సాలిడ్ ధరకి మాస్ కా దాస్ “ధమ్కీ”.?

Published on Feb 27, 2023 10:00 am IST

మన టాలీవుడ్ యూత్ లో మంచి క్రేజ్ ఉన్నటువంటి టాలెంటెడ్ హీరోస్ లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కూడా ఒకడు. మరి హీరోగానే కాకుండా విశ్వక్ రచయితగా దర్శకునిగా గా కూడా తన సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. మరి అలా తాను చేస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమానే “దాస్ కా ధమ్కీ”. తాను హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో తన హిట్ పెయిర్ నివేత పెత్తురాజ్ జంటగా నటిస్తుంది. మరి ఆల్రెడీ ఈ సినిమా నుంచి సాంగ్స్ పెద్ద హిట్ కాగా రిలీజ్ కూడా ఈపాటికే అవ్వాల్సింది.

కానీ పెండింగ్ పనులు మూలాన రిలీజ్ ని మేకర్స్ వాయిదా వేశారు. ఇక పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తున్న ఈ సినిమాకి అయితే డిమాండ్ విశ్వక్ గత చిత్రాలతో పోలిస్తే బాగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమాకి లేటెస్ట్ గా నైజాం లో 4 కోట్ల మేర డీల్ ని పూర్తి చేసుకున్నట్టుగా తెలుస్తుంది. దీనితో ఈ సినిమా విషయంలో మంచి అంచనాలే ఇంకా ఉన్నాయని చెప్పుకోవాలి. ఇక ఈ సినిమాకి రామ్ మిర్యాల సంగీతం అందిస్తుండగా వణ్మయి క్రియేషన్స్ మరియు విశ్వక్ సేన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :