టాక్..దాస్ “ధమ్కీ” కోసం తన అభిమాన హీరో.?

Published on Mar 8, 2023 7:26 pm IST


మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో యూత్ లో మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో విశ్వక్ సేన్ కూడా ఒకడు. మరి తాను నటిస్తున్న తన స్వీయ దర్శకత్వ లేటెస్ట్ చిత్రం “దాస్ కా ధమ్కీ” కోసం తెలిసిందే. ఆల్రెడీ సాంగ్స్ తో సగం హిట్ అయ్యిన ఈ చిత్రం రిలీజ్ పలు కారణాల చేత అయితే అనుకున్న సమయానికి రిలీజ్ కాలేదు. మరి ఇప్పుడు అయితే ఎట్టకేలకు అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ మార్చ్ 22న రిలీజ్ కి సిద్ధం అయ్యినట్టుగా తెలుస్తుంది.

అయితే ఈ సినిమాకి మరింత హైప్ ఎక్కించడానికి అయితే ఈ యంగ్ హీరో సాలిడ్ ప్లాన్ వేసినట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం అయితే విశ్వక్ సేన్ ఆల్ టైం ఫెవరెట్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని పిలవనున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ఈవెంట్ ఈ మార్చ్ 17న ప్లాన్ చేస్తుండగా తారక్ అయితే ఈ ఈవెంట్ ని గ్రేస్ చేయనున్నట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. మరి దీనిపై అయితే అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :