ఇంట్రెస్టింగ్ గా విశ్వక్ సేన్ “లైలా” మూవీ అనౌన్స్ మెంట్ వీడియో!

ఇంట్రెస్టింగ్ గా విశ్వక్ సేన్ “లైలా” మూవీ అనౌన్స్ మెంట్ వీడియో!

Published on Mar 29, 2024 4:07 PM IST


మాస్ కా దాస్ విశ్వక్సేన్ ఇటీవల గామి(Gaami) లో చివరిసారిగా కనిపించారు. ఇది నటుడి కెరీర్‌లో ఒక ముఖ్యమైన మైలురాయి చిత్రం. ఈ చిత్రం త్వరలో OTT ప్లాట్‌ఫామ్‌లో విడుదల కానుంది. ఈ రోజు నటుడి పుట్టినరోజు సందర్భం గా తన అప్ కమింగ్ చిత్రాలకి సంబందించిన అప్డేట్స్ వస్తున్నాయి. VS 12 కి సంబందించిన అప్డేట్ వెలువడింది. ఈ చిత్రం కి సంబందించిన టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియో ను మేకర్స్ రిలీజ్ చేయడం జరిగింది. వీడియో ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. సినిమాను లైలా అనే టైటిల్ ను ఖరారు చేసారు.

ఇటీవల సూపర్ హిట్ మూవీ భగవంత్ కేసరిని ప్రొడ్యూస్ చేసిన షైన్ స్క్రీన్స్ ఈ చిత్రానికి నిర్మాణం వహిస్తుంది. బట్టల రామస్వామి బయోపిక్‌కి దర్శకత్వం వహించిన రామ్ నారాయణ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇందులో ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తుండగా, తనిష్క్ బాగ్చి సంగీతం అందిస్తున్నారు. రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు