ఈ ఏడాది ఆఖర్లో ‘శౌర్యం’ డైరెక్టర్ తో సూర్య !

Published on Apr 9, 2019 3:00 am IST

గోపీచంద్ తో ‘శౌర్యం’ సినిమాతో టాలీవుడ్ లో డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు శివ. ఇక ఇటీవలే తమిళ స్టార్ హీరో అజిత్ హీరోగా ‘విశ్వాసం’ను తెరకెక్కించాడు శివ. తెలుగులో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపించకపోయినప్పటికీ.. తమిళంలో మాత్రం భారీ విజయాన్ని సాధించింది. కాగా తాజాగా కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం తమిళ్ స్టార్ హీరోల్లో ఒకరైన సూర్యతో తన తరువాత సినిమాను చేసేందుకు రెడీ అవుతున్నాడట శివ. ఇప్పటికే సూర్యకు కథ కూడా చెప్పాడట. కథ బాగా నచ్చిన సూర్య, సినిమా చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని.. ఈ ఏడాది ఆఖర్లో ఈ చిత్రం మొదలవ్వనునన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :