విశ్వాసం తెలుగు , కన్నడ వర్షన్ల రిలీజ్ డేట్స్ ఫిక్స్ అయ్యినట్లే ?

Published on Jan 8, 2019 11:50 pm IST

తల అజిత్ నటించిన యాక్షన్ ఎంటర్టైనెర్ ‘విశ్వాసం’ ఈ నెల 10న భారీ స్థాయిలో విడుదలకు సిద్దమైంది. తమిళనాడు వ్యాప్తంగా ఈ చిత్రం సుమారు 650 పైగా స్క్రీన్ లలో సందడి చేయనుంది. అయితే ఈచిత్రాన్ని తెలుగు లో అదే సమయానికి విడుదలచేయడం లేదని తెలిసిందే. ఇక తాజాగా ఈ చిత్రాన్ని తెలుగు తో పాటు కన్నడ లో కూడా డబ్ చేయనున్నారు. రేపటినుండి ఈ డబ్బింగ్ పనులు ప్రారంభం కానున్నాయి. అన్ని కుదిరితే ఈ రెండు వెర్షన్లను జనవరి 25న విడుదలచేయనున్నారని సమాచారం.

శివ తెరకెక్కించిన ఈ చిత్రంలో అజిత్ సరసన నయనతార కథానాయికగా నటించగా ఇమ్మాన్ సంగీతం అందించారు. సత్యజ్యోతి ఫిలిమ్స్ నిర్మించిన ఈచిత్రంఫై తమిళ ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇదిలావుంటే అదే రోజు సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘పెట్టా’ కూడా విడుదలవుతుండడంతో కోలీవుడ్ బాక్సాఫిస్ వద్ద ఈ రెండు చిత్రాల మధ్య ఆసక్తికర పోరు జరుగనుంది.

సంబంధిత సమాచారం :

X
More