120 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా.. 3 కోట్లకే !

Published on Feb 28, 2019 1:18 am IST

శివ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన ‘విశ్వాసం’ తమిళంలో సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద 90 కోట్ల ప్రీ రిలీజ్ తో దాదాపు 120 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. అజిత్ కెరీర్ లోనే సూపర్ హిట్ ఫిల్మ్ గా నిలిచింది. కాగా ఇప్పుడు ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మార్చి 1వ తేదీన తెలుగులో కూడా రిలీజ్ కాబోతుంది.

అయితే విశ్వాసం సినిమా తెలుగులో సుమారు 3 కోట్లు ప్రీ రిలీజ్ తో రిలీజ్ కాబోతున్నన్నట్లు తెలుస్తోంది. 120 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన హీరో సినిమా తెలుగులో మాత్రం కేవలం 3 కోట్లకే పరిమితమైంది. ఇంతకీ ఆ మూడు కోట్లు అన్నా కలెక్ట్ చేసి బయ్యర్స్ కి లాభాలు తెస్తుందా లేదా అనేది చూడాలి.

కాగా సినిమాలో మాత్రం అజిత్ హీరోయిజాన్ని బాగా చూపించారట. తెలుగులో కూడా ఈ సినిమా మాస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేలా ఉంది. ఇక ఈ సినిమాలో అజిత్ సరసన స్టార్ హీరోయిన్ నయనతార కథానాయికగా నటించింది. ఈ చిత్రానికి డి.ఇమ్మాన్ సంగీతం అందిచాడు.

సంబంధిత సమాచారం :