విశ్వాసం తెలుగు వెర్షన్ విడుదల తేదీ ఖరారు !

విశ్వాసం తెలుగు వెర్షన్ విడుదల తేదీ ఖరారు !

Published on Feb 15, 2019 3:27 AM IST

స్టార్ హీరో తల అజిత్ నటించిన ‘విశ్వాసం’ ఇటీవల విడుదలై 200కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి సూపర్ హిట్ అయ్యింది. ఇక ఈ చిత్రాన్ని తెలుగు తోపాటు కన్నడ లో కూడా డబ్ చేస్తున్నారు. మార్చి 1న ఈ చిత్రం యొక్క తెలుగు వెర్షన్ ను విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం యొక్క తెలుగు థియేట్రికల్ హక్కులను ఎన్ఎన్ఆర్ ఫిలిమ్స్ అధినేత ఆర్. నాగేశ్వర రావు సొంతం చేసుకున్నారు అయితే కన్నడ వెర్షన్ విడుదల తేదీ ఫై ఇంకా క్లారిటీ రాలేదు. ఇక తెలుగులో అదే రోజు కళ్యాణ్ రామ్ నటిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘118’ కూడా విడుదలకానుంది.

ఫ్యామిలీ డ్రామా గా శివ తెరకెక్కించిన ఈ విశ్వాసం చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటించగా జగపతి బాబు ప్రతినాయకుడి పాత్రను పోషించారు. ఇమ్మాన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సత్య జ్యోతి ఫిలిమ్స్ నిర్మించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు