సెకండ్ లుక్ తో రానున్న అజిత్ ‘విశ్వాసం’ !

Published on Oct 24, 2018 11:23 am IST

తల అజిత్ నటిస్తున్న విశ్వాసం చిత్రం యొక్క షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఇంకా ఒక్క సాంగ్ చిత్రీకరణ మాత్రమే బ్యాలెన్స్ వుంది. ఇక ఈ చిత్రం యొక్క అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నఅజిత్ అభిమానులకు శుభవార్త. ఈచిత్రంలోని సెకండ్ లుక్ ను అక్టోబర్ 25న ఉదయం 10:30 గంటలకు విడుదలచేయనున్నారు.

శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అజిత్ డ్యూయెల్ రోల్ లో కనిపించనునున్నాడు. యాక్షన్ డ్రామా గా రానున్న ఈ చిత్రంలో అజిత్ సరసన నయనతార కథానాయికగా నటిస్తుంది. ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నారు. సత్యజ్యోతి ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :