సరికొత్త ప్రమోషన్స్ షురూ చేసిన “వివాహ భోజనంబు” టీమ్!

Published on Aug 25, 2021 9:02 pm IST

రామ్ అబ్బరాజు దర్శకత్వం లో సత్య, సందీప్ కిషన్, ఆర్జవీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం వివాహ భోజనంబు. కామెడీ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేందుకు సిద్దం అవుతుంది. ఆగస్ట్ 27 వ తేదీన సోనీ లివ్ లో ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ గా విడుదల అయ్యేందుకు సిద్దం గా ఉంది. తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన పలు పోస్టర్లు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. బడ్జెట్ ఆఫ్ ది వెడ్డింగ్ పేరిట ఒక పోస్టర్, మహేష్ వెడ్స్ అనిత అంటూ మరొక పోస్టర్ లు పెళ్లి కార్డ్ లాగా దర్శనం ఇస్తున్నాయి. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు రెడీ, లాక్ డౌన్ సమయం లో పెళ్లి జరిగిన విధానం పై, అక్కడ ఏర్పడ్డ కామెడీ పై చిత్రం ఉండనుంది. ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :