కోవిడ్ వైద్యుల కోసం ముందడుగు వేసిన సురేష్ బాబు

కోవిడ్ వైద్యుల కోసం ముందడుగు వేసిన సురేష్ బాబు

Published on Apr 28, 2021 8:00 PM IST

దేశవ్యాప్తంగా కోవిడ్ సెకండ్ వేవ్ తీవ్ర రూపం దాలుస్తోంది. ఎటు చూసినా పెరుగుతున్న కేసులు, నిండిపోతున్న ఆసుపత్రులే. తెలుగు రాష్ట్రాల్లో కూడ ఇదే పరిస్థితి. వైద్యులు కోవిడ్ బాధితులకు చికిత్స అందించేందుకు సర్వ శక్తులు ఒడ్డుతున్నారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ ఎక్కువ సమయం ఆసుపత్రుల్లోనే ఉంటూ బాధితులకు చికిత్స చేస్తున్నారు. కోవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స అందించే వైద్యులు ఎప్పటికా ఇళ్లకు వెళ్ళడం కుదరని పని. అందుకే అలాంటి వారి కోసం నిర్మాత సురేష్ బాబు ముందడుగు వేశారు.

వైజాగ్లో ఉన్న రామానాయుడు స్టూడియోస్ నందు కోవిడ్ రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులకు వసతి ఏర్పాట్లు చేస్తున్నారు. వేలకు వేలు చెల్లించి హోటల్ రూముల్లో ఉండాల్సిన అవసరం లేకుండా వారి కోసం ఐసోలేషన్ రూమ్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లను సురేష్ బాబు, ఆయన చిన్న కుమారుడు అభిరామ్ దగ్గరుండి చూసుకుంటున్నారు. కరోనా మీద అలుపెరుగకుండా పోరాడుతున్న వైద్యుల కోసం ఇలా వసతి ఏర్పాట్లు చేస్తున్నందుకు నిర్మాత సురేష్ బాబును అభినందించాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు