“ఓటర్” మూవీ విడుదల హక్కులను చేజిక్కించుకున్న సార్ధక్ మూవీస్.

Published on Jun 19, 2019 1:42 pm IST

హీరో మంచు విష్ణు,సురభి జంటగా జి కార్తీక్ రెడ్డి దర్శకతంలో తెరకెక్కిన మూవీ “ఓటర్”. ప్రస్తుత రాజకీయ పరిస్తితులపై వ్యంగ్యాస్త్రంగా, పొలిటికల్ డ్రామాగా రామా రీల్స్ బ్యానర్ పై తెరకెక్కింది. నిర్మాణాంతర కార్యక్రమాలు అన్ని పూర్తిచేసుకొని ఈనెల 21న విడుదల కానుంది. ఈ మూవీ విడుదల హక్కులను నిర్మాణ సంస్థ సార్థక మూవీస్ చేజిక్కుంచుకుంది.

ఈ సందర్బంగా సార్థక్ మూవీస్ అధినేత అయిన ప్రశాంత్ గౌడ్ మాట్లాడుతూ గతంలో మా సంస్థలో ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించడం,అలాగే డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అలాగే గట్టిపోటీ మధ్య ‘ఓటర్’ మూవీ విడుదల హక్కులను, అత్యధిక ధర చెల్లించి సొంతం చేసుకున్నాం అన్నారు. అలాగే సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని గట్టిగా నమ్ముతున్నాం అన్నారు. ఈ మూవీ నిర్మాతైన జాన్ సుధీర్ పూదోట మాట్లాడుతూ ప్రశాంత్ గౌడ్ వారి నిర్మాణ సంస్థ సార్ధక మూవీస్ ద్వారా మా చిత్రాన్ని విడుదల చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఓటర్ మంచి విజయం సాధించి వారికి లాభాలు రావాలని ఆశిస్తున్నాను అన్నారు.

సంబంధిత సమాచారం :

More