బెదిరింపుల‌కు లొంగేది లేదట !

Published on Jun 20, 2019 9:30 pm IST

మంచు విష్ణు, సురభి జంటగా జి. కార్తీక్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఓటర్‌’. జాన్‌ సుధీర్‌ పూదోట నిర్మించారు. ఈ చిత్ర ప్రపంచ థియేట్రికల్ హక్కుల‌ను సార్ధక్‌ మూవీస్‌ పతాకం పై ప్రశాంత్‌ గౌడ్‌ దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే ‘‘ఓటర్‌’ సినిమా విడుదల విషయంలో కొందరు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని, సినిమాని ఆపాలంటూ బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని.. అయితే ఎన్ని బెదిరింపులు వచ్చినా సినిమాని ఆపేది లేదని.. ఖచ్చితంగా గ్రాండ్‌ గా విడుదల‌ చేస్తున్నాం’ అని నిర్మాత ప్రశాంత్‌ గౌడ్‌ అన్నారు.

అయితే ఈ సినిమా స్క్రిప్ట్‌ విషయంలో వివాదం తలెత్తిన నేపథ్యంలో చిత్ర రామరీల్స్‌కి చెందిన నిర్మాత జాన్‌ సుధీర్‌ పూదోట, దర్శకుడు కార్తీక్‌పై 24 ఫిల్మ్‌ ఫ్యాక్టరీ సంస్థ‌ కోర్టులో కేసు వేసిన విషయం విదితమే. సినిమాని ఆపాలంటూ వేసిన పిటిషన్‌ని కోర్టు తిరస్కరించింది. ఈ విషయాన్ని అడ్వకేట్ వేణుకుమార్ వెల్ల‌డించారు.

సంబంధిత సమాచారం :

X
More