‘బృందావనకాలని’ కపుల్ 15ఏళ్ల తరువాత కలిశారు….!

Published on Jun 30, 2019 11:33 pm IST

రవి కృష్ణ,సోనియా అగర్వాల్ హీరో హీరోయిన్లుగా టాలెంటెడ్ డైరెక్టర్ సెల్వరాఘన్ దర్శకత్వంలో 2004 విడుదలైన “బృందావన కాలని” అప్పట్లో ఒక సెన్సేషన్ సృష్టించింది.ఈ ట్రాజెడీ లవ్ స్టోరీ తెలుగు,తమిళ భాషలలో రికార్డు వసూళ్లు సాధించింది. అప్పట్లో ఈ సినిమాపై యువత కున్న క్రేజ్ మాటల్లో చెప్పలేం. దీనితో ఈ చిత్రంలో నటించిన రవి కృష్ణ, సోనియా అగర్వాల్ ఇద్దరికి మంచి గుర్తింపు వచ్చింది. ఐతే తరువాత వీరు చేసిన సినిమాలు అంతగా విజయం సాధించకపోవడంతో చిన్నగా ఇద్దరు సినిమాలకు దూరమయ్యారు.

కాగా ఈ చిత్రం విడుదలైన 15 ఏళ్ల తర్వాత ఈ జంట తాజాగా ఓ ప్రైవేట్ కార్యక్రమంలో కలిశారంట.తాము కలిసి నటించిన అప్పటి సక్సెస్ ఫుల్ మూవీ ముచ్చట్లు చెప్పుకున్న వీరిద్దరూ ఓ ఫోటో కూడా దిగారు. ఇప్పడు ఆఫొటో సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం :

More