నవంబర్ 28న ‘ఉందిలే మంచి కాలం..’

నవంబర్ 28న ‘ఉందిలే మంచి కాలం..’

Published on Nov 4, 2014 12:28 AM IST

Undhile-Manchi-Kalam-Mundhu
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరో సుధాకర్ కొమకుల. ఈ యువ హీరో తాజాగా నటించిన సినిమా ‘ఉందిలే మంచి కాలం ముందు ముందునా’. ఆమ్ ఆద్మీ పిక్చర్స్ పతాకంపై అరుణ్ దాస్యమ్ దర్శకత్వంలో రావిరాష్ దాస్యమ్ నిర్మించారు. సీనియర్ నటుడు నరేష్, రాధికా శరత్ కుమార్, కార్తిక్, అవంతిక, నీతూ చౌదరి, పూర్ణిమ ప్రధాన పాత్రలలో నటించారు.

సెన్సార్ బోర్డ్ నుండి క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ పొందిన ఈ సినిమా నవంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇటివలే రామ్ నారాయణ్ సంగీతం అందించిన ఆడియో విడుదలైంది. శ్రోతల నుండి ఆడియోకి మంచి స్పందన లభించింది. ఈ సందర్భం సోమవారం హైదరాబాద్ లో సినిమా ఆడియో సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. కొత్త కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారు అనే నమ్మకంతో ఉన్నట్టు తెలిపారు.

తాజా వార్తలు