ఆడియో, ట్రైలర్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ !
Published on Oct 8, 2017 10:04 am IST

యంగ్ హీరో రామ్ చేస్తున్న తాజా చిత్రం ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ షూటింగ్ మొత్తం పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనిలో ఉంది. మరోవైపు ప్రచార కార్యక్రమాల్ని కూడా ప్రారంభించారు చిత్ర టీమ్. స్వయంగా హీరో రామ్ ఈ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఇకపోతే తాజా సమాచారం ప్రకారం సినిమా ఆడియో, థియేట్రికల్ ఈ నెల 13న రిలీజ్ చేయనున్నారట. ‘నేను శైలజ’ వంటి హిట్ తర్వాత కిశోర్ తిరుమల, రామ్ లు కలిసి చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో దీనిపై అందరిలోనూ పాజిటివ్ అభిప్రాయమే ఉంది.

అంతేగాక గత చిత్రం ‘హైపర్’ తో నిరాశచెందిన రామ్ కూడా ఈ సినిమాపైనే బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠిలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. స్నేహం, ప్రేమల నైపథ్యంలో సాగే ఈ సినిమాను స్రవంతి సినిమాటిక్ పతాకంపై కృష్ణ చైతన్య నిర్మిస్తున్నారు. శ్రీ విష్ణు, ప్రియదర్శిలు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను ఈ నెల 27న ప్రేక్షకులకు అందివ్వనున్నారు.

 
Like us on Facebook