ఇక్కడ హిట్ కానీ సినిమాలకు అక్కడ సూపర్ రెస్పాన్స్ !

Published on Feb 6, 2019 11:23 am IST

కిశోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ , అనుపమా జంటగా నటించిన చిత్రం ‘ఉన్నది ఒకటే జిందగీ’. 2017లో విడుదలైన ఈ చిత్రం విజయాన్ని సాధించలేకపోయింది. అయితే ఇటీవల గోల్డ్ మైన్ ఫిలిమ్స్ ఈ చిత్రం యొక్క హిందీ డబ్బింగ్ వెర్షన్ ను ‘నంబర్ 1 దిల్వాలే’ అనే టైటిల్ తో యూ ట్యూబ్ లో అప్లోడ్ చేయగా ఇప్పటివరకు 30 మిలియన్ల వ్యూస్ ను రాబట్టింది. అంతేకాకుండా ఇంత తక్కువ సమయంలో ఈ రేంజ్ లో వ్యూస్ ను రాబట్టిన డబ్బింగ్ సినిమా కూడా ఇదేనట.

ఇక అలాగే అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య అలాగే సాయి ధరమ్ తేజ్ నటించిన తేజ్ ఐ లవ్ యు హిందీ డబ్బింగ్ వెర్షన్ లు ఇటీవల యూట్యూబ్ లో విడుదలై మంచి వ్యూస్ ను రాబడుతున్నాయి.

సంబంధిత సమాచారం :