స్టార్ డైరెక్టర్ చేతుల మీదగా ‘రహస్యం’ ఫస్ట్ లుక్ విడుదల !

స్టార్ డైరెక్టర్ చేతుల మీదగా ‘రహస్యం’ ఫస్ట్ లుక్ విడుదల !

Published on Sep 13, 2018 3:00 PM IST

Rahasyam
నూతన దర్శకుడు సాగర శైలేశ్ దర్శకత్వంలో భీమవరం టాకీస్ అధినేత తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు నిర్మస్తున్న చిత్రం ‘రహస్యం’. కాగా సెన్సషనల్ డైరెక్టర్ వి .వి.వినాయక్ చేతుల మీదుగా రహస్యం చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసారు. ఈ సందర్భంగా వి.వి.వినాయక్ మాట్లాడుతూ.. ఇలా కొత్త టాలెంట్ ని సపోర్ట్ చేస్తూ.. వారి సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చెయ్యటం చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్ర నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణకు ఈ చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్ అని తెలిపారు.

తుమ్మలపల్లి రామసత్యనారాయణ, షార్ట్ ఫిలిమ్స్ ద్వారా తమ ప్రతిభను చూపించిన నూతన దర్శకుడు సాగర శైలేశ్ కి డైరెక్టర్ గా అవకాశమిచ్చి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కొత్త నటీనటులను కూడా పరిశ్రమకు పరిచయం చేస్తుండటం విశేషం. కాగా శ్రీ రితిక హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రలో జబర్దస్త్ అప్పారావు తదీ తరులు నటించారు.

ఈ చిత్రానికి కెమెరా బాధ్యతలు అక్కినపల్లి సుధాకర్ నిర్వహిస్తుండగా, కబీర్ రఫీ సంగీతం సమకూరుస్తున్నారు. సాగరశైలేశ్ దర్శకత్వంతో పాటు రచన బాధాతలను చేపట్టారు.

తాజా వార్తలు